ఈ నెల 26న చలో కోరుకోండకు పిలుపు
E.G: కోరుకొండ మండలం మధురపూడిలో దళిత యువకుడు పాముల శ్రీనుపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ నెల 26న 'చలో కోరుకొండ'కు దళిత నాయకులు గురువారం పిలుపునిచ్చారు. ఈ దాడిలో 9 మంది పాల్గొనగా, కేవలం నలుగురిని మాత్రమే అరెస్టు చేయడం వెనుక పోలీసుల ఉద్దేశం అర్థం కావడం లేదని దళిత నాయకులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మిగిలిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు.