VIDEO: యూరియా కోసం రైతుల ఇక్కట్లు

MDK: శివంపేట మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం మంగళవారం రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ కేంద్రం వద్దకు సద్దిమూటలతో విచ్చేసిన రైతులు అక్కడే భోంచేసి పడుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి యూరియా కోసం రాళ్లు, ఇటుకలు, కర్రలు, సద్ది మూటలు క్యూ లైన్‌గా కట్టి అక్కడే నిద్రించారు. రైతులకు సరిపోయే యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.