'వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్'
MNCL: కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని సీఐటీయు మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీలో కార్మికులతో కలిసి సీఐటీయు మహాసభలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. నవంబర్ 15, 16 తేదీలలో సిఐటియు మహాసభలు జరుగుతాయని, ఆ మహాసభలకు కార్మికులు పెద్ద ఎత్తున రావాలన్నారు.