కురువిలో ఘనంగా ధర్మభిక్షం జయంతి వేడుకలు

MHBD: కురవి మండల కేంద్రంలోని సీపీఐ పార్టీ మండల కార్యాలయంలో నేడు కామ్రేడ్ ధర్మ బిక్షం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గీత పని వారిలా సంఘం రాష్ట్ర కార్యదర్శి పోగుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధర్మ బిక్షం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి నందు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.