'వెంటనే వరి బోనస్ను విడుదల చేయాలి'
BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సన్నవల పంటలకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. గడువులోగా పరిష్కారం కాకపోతే టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతామని హెచ్చరించారు.