జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన పోతుల సునీత

VSP: విశాఖకి చెందిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. దాదాపు ఏడాది క్రితం ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఆమె, తాజాగా బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ చేరికతో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.