లారీ ఢీకొని.. వ్యక్తి మృతి

లారీ ఢీకొని.. వ్యక్తి మృతి

KNR: నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చాకుంత గ్రామానికి చెందిన రవి, బొమ్మకల్ ఫ్లైఓవర్‌పై నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ కృష్ణకుమార్‌పై కేసు నమోదు చేశారు.