ద్వారపూడిలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలు

కోనసీమ: మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరిస్సా 116వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న మదర్ తెరిస్సా విగ్రహానికి మదర్ థెరిస్సా సేవాసమితి సభ్యులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మదర్ థెరిస్సా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.