'ఉద్యానవనం పార్కు ఏర్పాటు చేయాలి'

'ఉద్యానవనం పార్కు ఏర్పాటు చేయాలి'

NDL: ఆత్మకూరు పట్టణంలో ఉద్యానవనం పార్కు ఏర్పాటు చేయాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కమిషనర్ రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 55 వేల జనాభా దాటిన ఒక పార్కు లేకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సురేంద్ర, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.