కామాక్షి పీఠాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే
శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధిలోని పాండురంగ వీధిలో ఉన్న కామాక్షి పీఠాన్ని శుక్రవారం శాసనసభ్యులు గొండు శంకర్, స్వాతి దంపతులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు అమ్మవారిని దర్శించుకుని జిల్లాలో శాంతి, సమృద్ధి, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.