సీఎం సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎంపీలు
ATP: శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు CM చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన ముఖ్య అంశాలపై ఈ సందర్భంగా ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం ఎంపీ పార్థసారధి పాల్గొన్నారు.