'పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి'
KNR: శంకరపట్నం మండల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్ సురేఖకు వినతిపత్రం ఇచ్చారు. జూన్ 2 నాటికి పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) తేవాలని, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుతామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.