ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించిన కలెక్టర్ దంపతులు

NDL: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తన భర్తతో కలిసి గురువారం యాగంటి ఉమామహేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు కలెక్టర్ దంపతులకు ఆలయ చరిత్రను వివరించి ఆశీర్వాద తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులు కలెక్టర్ దంపతులను చూసి ఉత్సాహంగా స్వాగతం పలికారు.