హక్కులు, చట్టాల సాధనకు పోరాటం

ASR: మర్రి కామయ్య స్ఫూర్తితో గిరిజన హక్కుల సాధనకు పోరాటం చేయాలని గిరిజనసంఘం జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీ ఉద్యమకారుడు మర్రి కామయ్య వర్ధంతిని సోమవారం అరకులో నిర్వహించారు. కామయ్య విగ్రహానికి ఎంపీడీవో లవరాజుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వారికి వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారన్నారు