VIDEO: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
VIDEO: మచిలీపట్నం-పెడన హైవేపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వాకింగ్ చేసే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పెడన 12వ వార్డుకు చెందిన మట్టా బాబూరావుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనంతో ఢీకొట్టిన వ్యక్తి సమాచారం తెలియాల్సి ఉంది.