మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే
KMR: బాన్సువాడ బస్‌స్టాండ్‌లో ఏర్పాటు చేసిన మహాలక్షి పథకం సంబరాల్లో MLA పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు బాన్సువాడ డిపో నుంచి మహిళలు 2.42 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని చేసి, రూ.90.32 కోట్లు ఆదా చేసుకున్నారని డిపో మేనేజర్ రవి కుమార్ వివరించారు.