పవన్ కు ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి
NLR: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆత్మకూరు ప్రజలు రుణపడి ఉంటారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 10 పంచాయతీ భవనాలకు పవన్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనేక అభివృద్ధి పనులకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఆత్మకూరు ఆసుపత్రికి 250 పడకలకు పెంచామని, భవన నిర్మాణం జరుగుతోందని మంత్రి వెల్లడించారు.