ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

సిద్దిపేట: పట్టణంలోని స్థానిక మార్కండేయ ఆలయ అభివృద్ధికి పట్టణానికి చెందిన వ్యాపారి సకినాల మార్కండేయ రూ. 25,555 విరాళం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు కాముని రాజేశం, ముదిగొండ శ్రీనివాస్‌లకు సదరు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు అశోక్, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.