ప్రయాణంలో జాగ్రత్త.. సురక్షితంగా గమ్యం చేరండి: ఎస్పీ
SRPT: సంక్రాంతి ముగియడంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ ఈరోజు సూచించారు. విజయవాడ హైవేపై రద్దీ దృష్ట్యా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు. రోడ్డు పనుల వద్ద ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని, అతివేగం, నిద్రమత్తు వద్దని కోరారు. అత్యవసరమైతే డయల్ 100కు ఫోన్ చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.