'పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోని కాంగ్రెస్'
WNP: పేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడి అక్కడే ఉన్న ప్రభుత్వ డయగ్నొస్టిక్ హబ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారిస్తుందన్నారు.