ఓయూలో బీసీ JAC ఆధ్వర్యంలో ధర్మ దీక్ష
BHNG: హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్‌లో ఓయూ బీసీ JAC ఆధ్వర్యంలో బీసీ కులాలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల సాధనకై ఇవాళ ధర్మ దీక్ష చేపట్టారు. ఈ ధర్మ దీక్షలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఐలయ్య వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఓయూ JAC నాయకులు తదితరులు పాల్గొన్నారు.