జాబ్ మేళాను ప్రారంభించిన మంత్రి

కోనసీమ: రామచంద్రపురం పట్టణంలో ఉన్న మోడ్రన్ కాలేజీ ప్రాంగణంలో మంగళవారం వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే ప్రతి వారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.