నూతన ఛాన్స్‌లర్‌గా డాక్టర్ పావులూరి సుబ్బారావు బాధ్యతలు
BHNG: విజ్ఞాన్స్ యూనివర్సిటీ నూతన ఛాన్స్‌లర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త, అంతరిక్ష రంగంలో విశిష్ట సేవలందించిన డాక్టర్ పావులూరి సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.