అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మంత్రి
సత్యసాయి: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జనరల్ సెక్రటరీల వర్క్‌షాప్‌లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడంలో పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించాలన్నారు.