RTC బస్సు లేక విద్యార్థుల ఇక్కట్లు

RTC బస్సు లేక విద్యార్థుల ఇక్కట్లు

GDWL: మానవపాడు(M)లోని పెద్దఆముదాలపాడు, నారాయణపురానికి గత 4-5 రోజులుగా RTC సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు గ్రామాల నుంచి మండలంలోని ZPHSకు వచ్చేందుకు ప్రైవేటు వాహనాలలో రావాల్సి వస్తోంది. 20 మందికిపైగా విద్యార్థులు నిన్న ఓ ఆటోలో ప్రమాదకర ప్రయాణం చేస్తూ పాఠశాలకు వచ్చారు. దీనిపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.