VIDEO: పలు గ్రామాలలో వర్షం

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాథపురం, మాగాం, పోతుకుర్రు గ్రామాలలో బుధవారం మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంది. ఒక్కసారే వర్షం కురవడంతో ప్రయాణికులు, వాహనదారులు ట్రాఫిక్‌లో నిలిచిపోయారు. బంగళాఖాతంలో అల్పపీడనం కారణంగా 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.