మెట్టగూడకి సొంతంగా రహదారి నిర్మాణం

మెట్టగూడకి సొంతంగా రహదారి నిర్మాణం

VSP: గూడెంకొత్తవీధి మండలంలోని దేవరపల్లి పంచాయతీ పరిధి మెట్టగూడకి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఎన్నోసార్లు విన్నవించిన పట్టించుకోలేదు. దీంతో శనివారం గ్రామస్తులంతా కలసి మెట్టగూడకి వెళ్లే రహదారికి సొంతంగా నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి సమస్యపై అధికారులు స్పందించాలన్నారు.