బాలికపై అత్యాచారయత్నం.. పోక్సో కేసు నమోదు
కృష్ణా: నాగాయలంక మండలం చోడవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వంశీపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె. రాజేశ్ తెలిపారు. చోడవరం నుంచి కాలేజీ విద్యార్థినులను తీసుకువెళ్లే వంశీ, ఈ నెల 7న ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసి విజయవాడలోని లాడ్జికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు, బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.