రూ.3900 కోట్ల పనులను ప్రారంభించిన గడ్కరీ

రూ.3900 కోట్ల పనులను ప్రారంభించిన గడ్కరీ

TG: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కొమురంభీం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.3900 కోట్లతో జాతీయ రహదారుల పనులను గడ్కరీ ప్రారంభించారు. సిర్పూర్-కాగజ్‌నగర్ నేషనల్ హైవే 363ను జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క పాల్గొన్నారు.