79 ఏళ్ల నిరీక్షణకు మోక్షం.. శివాలయం వీధికి సీసీ రోడ్డు..!
ASR: గడికించుమండ గ్రామస్తుల ఏళ్ల కాలం నాటి కల నెరవేరబోతోంది. శివాలయం వీధిలో రహదారి దుస్థితిపై గత వారం ఐటీడీఏ 'మీకోసం'లో జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా, ఆయన తక్షణమే స్పందించారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో గురువారం ఇంజనీరింగ్ అధికారులు సంజీవ్, సంధ్య భారతి గ్రామానికి చేరుకుని రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ కొలతలు తీశారు.