విజయవాడలో ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహిణ

విజయవాడలో ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహిణ

NTR: విజయవాడలో కిశోరి వికాసంపై ప్రాంతీయ వర్క్‌షాప్ జరిగింది. కౌమార బాలికల సమగ్ర అభివృద్ధికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని పీడీ శ్రీలక్ష్మి కోరారు. జూన్ 1 నుండి 10 వరకు నిర్వహించే వేసవి సమావేశాలను బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా కౌమార దశలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పించనున్నారు.