మాజీ సర్పంచ్ మృతి.. అదుపులోకి బొలెరో డ్రైవర్
GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో మాజీ సర్పంచ్ భీమా రాయుడు అనుమానాస్పద మృతితో హై అలర్ట్ నెలకొంది. ఆయన మృతి ప్రమాదం కాదని హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బొలెరో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అటు గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో పోలీసులను బారీగా మొహరించారు.