డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్

BPT: డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, ఈబీసీ అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అవకాశం కల్పించనున్నట్లు అద్దంకి ఎంపీడీవో సింగయ్య మంగళవారం తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రం, టెట్ మార్క్ లిస్ట్, టీటీసీ మార్క్‌లిస్ట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, 2 ఫోటోలు దరఖాస్తుతో జత చేసి బాపట్లలోని వెనుకబడిన సంక్షేమ అధికారికి పంపించాలన్నరు.