ప్రేమ పేరుతో మోసం.. ప్రియురాలు ధర్నా

ప్రేమ పేరుతో మోసం.. ప్రియురాలు ధర్నా

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో ఓ యువతిని వివాహితుడు ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకుని ఇప్పుడు నిరాకరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోరుతూ శుక్రవారం ఆమె నిందితుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.