రానున్న మూడు రోజులు భిన్న వాతావరణం

రానున్న మూడు రోజులు భిన్న వాతావరణం

శ్రీకాకుళం జిల్లాలో రానున్న మూడు రోజులు భిన్న వాతావరణం ఉంటుందని APSDMA వెల్లడించింది. సోమవారం బూర్జ, జి.సిగడాం, కొత్తూరు, పొందూరు మండలాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. మిగిలిన మండలాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయని వడగాలులు వీచే అవకాశం లేదని X ఖాతా ద్వారా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.