జల్సాల కోసం ఇంట్లోనే చోరీ చేసిన యువకుడు
TG: HYDలోని కంచన్‌బాగ్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఇంట్లోని వ్యక్తే బంగారం చోరీ చేశాడని దర్యాప్తులో తేల్చారు. మార్చి 29న ఎండీ షరీఫ్ అనే వ్యక్తి ఇంట్లో 20 తులాల బంగారం మాయం అయ్యాయి. స్నేహితులతో కలిసి ఇంట్లోనే షరీఫ్ కుమారుడు అద్నాన్ షరీఫ్ 4 సార్లు బంగారం చోరీ చేశాడు. నిందితుల వద్ద 13 తులాల బంగారం, 4 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.