ప్రతి సమస్యను పరిష్కరించాలి: కలెక్టర్
అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో ఇవాళ PGRS కార్యక్రమంలో ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు స్నాక్స్, టీ, వాటర్ సౌకర్యం కల్పించారు.