రేపు జిల్లాలో పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్
రేపు జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్యక్రమం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు.అలాగే జనవరి 29న పెనుమంట్ర ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించేందుకు తలపెట్టిన ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని కూడా పరిపాలన కారణాలు దృష్ట్యా రద్దు చేయడం జరిగిందన్నారు.