సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
PDPL: మంథని మండలం మల్లేపల్లి గ్రామంలో ఆదివారం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని సర్పంచ్ సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.