2 నెలల్లో రూ. 500 కోట్లు.. విజయవాడ వ్యక్తి అరెస్ట్

2 నెలల్లో రూ. 500 కోట్లు.. విజయవాడ వ్యక్తి అరెస్ట్

NTR: విజయవాడకు చెందిన వడ్డేపల్లి శ్రవణ్ కుమార్(30) సైబర్ నేరగాళ్లకు సహకరించినందుకు గాను ఉత్తరాఖండ్ పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. దుబాయ్ వెళ్లిన శ్రవణ్ అక్కడ సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మ్యూల్ ఖాతాలు తెరిచి 2 నెలల్లో రూ. 500 కోట్ల మేర లావాదేవీలు జరిపి భారీగా కమిషన్ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.