యువత నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు: ఎస్సై
కోనసీమ: బొబ్బరలంకలోని పిచ్చుక లంక గోదావరిలో ఇటీవల నీటి ప్రవాహం పెరగడం, అక్కడక్కడా ఊబి ఉండటంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ఆత్రేయపురం ఎస్సై రాము తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలియని ప్రాంతాల్లో స్నానాలకు దిగకూడదని, ప్రత్యేకంగా యువత నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిస్తున్నారు.