గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

NRPT: నారాయణపేట పట్టణంలోని జీ-శాన్ హోటల్ సమీపంలో పళ్ల వీధికి వెళ్లే దారి పక్కన గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 70 సం.) మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మృతుడు పసుపుపచ్చ షర్టు, తెల్లని పంచె,స్వెటర్ ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా గుర్తిస్తే 871267 0404 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.