రాజమండ్రిలో వాహనాల బహిరంగ వేలం
E.G: రాజమండ్రి, గోకవరం ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనల కింద స్వాధీనం చేసుకున్న 38 వాహనాలకు ఈనెల 30న బహిరంగ వేలం నిర్వహించనున్నారు. పన్ను బకాయిలు, ఫిట్నెస్, పర్మిట్ లేని కార్లు, బస్సులు, ఆటోలు, బైకులు ఇందులో ఉన్నాయి. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు జిల్లా రవాణా కార్యాలయానికి రావాలని DTO ఆర్. సురేశ్ శుక్రవారం తెలిపారు.