డబ్బుకు ఆశపడి ఖాతాలు ఇవ్వకండి.!
HYD: 'భయ్యా నాకు ఓ వ్యక్తి డబ్బు ఇవ్వకుండా చాలా రోజులుగా సతాయిస్తున్నాడు. అడిగితే బ్యాంకు ఖాతాకే బదిలీ చేస్తా అంటున్నాడు. నా దాంట్లో లిమిట్ దాటిపోయింది. నీ అకౌంట్ ఇస్తావా. కావాలంటే కమిషన్ ఇస్తా. ప్లీజ్ కాదనకు' అంటూ సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలను (కమిషన్‌కు అకౌంట్ ఇవ్వడం) సమకూర్చుకుంటున్నారు. అయితే గుడ్డిగా నమ్మి ఖాతాలను అప్పజెప్పవద్దని దర్యాప్తు అధికారులు సూచిస్తున్నారు.