'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

BHPL: రేగొండ మండల కేంద్రంలోని MJP బాలుర పాఠశాలను గురువారం మండల ప్రత్యేక అధికారి ఏ. సునీల్ కుమార్ సందర్శించారు. పాఠశాలలో కూరగాయల స్టాక్ రిజిస్టర్, కూరగాయల తాజాదానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.