మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం

మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం

విశాఖ నగర పోలీసు శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పీలా అప్పారావు జనవరి 21న అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందారు. అప్పారావు కుటుంబానికి అయన బ్యాచ్ మేట్స్ రూ.1,02500 సహాయం చేశారు. ఈ సహాయాన్ని సీపీ శంకబ్రత బాగ్చి చేతులు మీదుగా బుధవారం అందించారు. ఆయనకు పోలీసు శాఖ నుంచి రావలసిన అన్నీ బెనిఫిట్స్ వీలైనంత తొందరగా వచ్చేటట్టు కృషి చేస్తామని సీపీ అన్నారు.