పన్ను వివరాలు ఆన్‌లైన్ చేయాలని ఆదేశం
WG: వ్యవసాయ భూములకు సంబంధించి నీటి తీరువా పన్ను వివరాలను నూరుశాతం ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయాలని ప్రత్యేక ఉప కలెక్టర్ బీఎస్ఎన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఆకివీడు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల భూముల సర్వే నంబర్లు నమోదు విషయంలో సందేహాలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.