మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన అధికారులు
RR: నార్కోటిక్ డ్రగ్స్ అధికారులు రూ.4.56 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను గురువారం ధ్వంసం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 26 పోలీస్ స్టేషన్లలో పట్టుబడిన గంజాయి తదితర నిషేధిత పదార్థాలను నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి శివారులో ఏర్పాటు చేసిన జీకే మల్టీ కేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ధ్వంసం చేశారు.