రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
సత్యసాయి: ఎల్లనూరులోని సాయిబాబా గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జంగంపల్లిలో జరుగుతున్న రణబలి సినిమా షూటింగ్ చూసి బైక్‌పై తిరిగి వస్తున్న నరేశ్ కుమార్‌ను ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి బాదితున్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.