ఢిల్లీ బ్లాస్ట్.. మరో వీడియో వైరల్
ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాద స్థలానికి సమీపంలోని ఓ మార్కెట్‌లో ప్రజలంతా రోజు వారి కార్యకలాపాలు సాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఆ సమయంలో భయబ్రాంతులకు గురైన ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా ప్రకంపనలు సంభవించినట్లు వీడియోలో చూడవచ్చు.